కేసీఆర్‌ తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్‌యే - ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Congress MLA Jaggareddy express his opinion on KTR has CM
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావును చేయాలనే ప్లాన్ వెనుక బీజేపీ అగ్రనేత ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు....

తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావును చేయాలనే ప్లాన్ వెనుక బీజేపీ అగ్రనేత ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్‌తో తనకు ఎలాంటి పంచాయితీ లేదన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేసీఆర్‌ తర్వాత సీఎంగా కేటీఆర్‌యే అవుతాడు కానీ అల్లుడు ఎలా అవుతారంటూ కుండబద్ధలు కొట్టారాయన. ప్రాంతీయ పార్టీలన్నీ ఇదే తరహాను అనుసరిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం మార్పు అనేది ఇంటి పంచాయతీ. కేసీఆర్ కొడుకుని సీఎం చేస్తారో.. కూతురుని చేస్తారో ఆయన ఇష్టం. సీఎం మార్పు వెనుక బీజేపీ ఆట ఉందనుకుంటా. కేటీఆర్ ని సీఎం చేయడం వెనుక బీజేపీ ఏదైనా డైరెక్షన్ ఉందేమో?. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. అమిత్ షా డైరెక్షన్ లోనే పరిణామాలు జరుగుతున్నాయి. ప్రజలను మోసం చేసే పనిలో టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. హరీష్ రాజకీయ నాయకుడా?, పెట్రోల్ పోసుకుని.. అగ్గిపెట్టే వెతికిన వాడు ఉద్యమకారుడా?' అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories