Jagga Reddy: సంజయ్ కు ధమ్ముంటే వరంగల్ కు వెళ్లి తేల్చుకుందాం..

Jagga Reddy: అగ్నిపథ్ రద్దయ్యే వరకు రాష్ట్రంలో బీజేపీ నాయకులకు తిరగనివ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Published on: 19 Jun 2022 4:33 PM IST
Congress MLA Jagga Reddy Slams BJP MP Bandi Sanjay
X

Jagga Reddy: సంజయ్ కు ధమ్ముంటే వరంగల్ కు వెళ్లి తేల్చుకుందాం..

Jagga Reddy: అగ్నిపథ్ రద్దయ్యే వరకు రాష్ట్రంలో బీజేపీ నాయకులకు తిరగనివ్వమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సత్యాగ్రహ దీక్షలో భాగంగా మాట్లాడిన ఆయన బండి సంజయ్ పై తీవ్రంగా స్పందించారు. సంజయ్ కు బుర్రలేదని.. ధమ్ముంటే వరంగల్ కు వెళ్లి తేల్చుకుందామన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ శవ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సికింద్రాబాద్ అల్లర్లలో మరణించిన రాకేష్ మరణానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. రాకేష్ ను బీజేపీ పోలీసులు కాల్చారా..లేక టీఆర్ఎస్ పోలీసులు కాల్చారా..? అని అడిగారు. బీజేపీ కంట్రోల్ లో ఉన్న పోలీసులే కాల్చారని జగ్గారెడ్డి అన్నారు.

డెడ్ బాడీపై టీఆర్ఎస్ కండువా కప్పేసి రాజకీయం చేస్తుందని విమర్శించారు. యువకులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన అన్నారు. పోలీసుల కాల్పులకు బలికావద్దని.. అధికారంలోకి వచ్చాక సోనియా గాంధీ మిమ్మల్ని కాపాడుకుంటుందని జగ్గారెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు సోనియా గాంధీ అండగా ఉంటారని అన్నారు. స్వాతంత్రదేశంలో ఎప్పుడూ కూడా సికింద్రాబాద్ లో ఇంత పెద్ద ఘటన చోటు చేసుకోలేదని అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story