రేపు సీఎంను కలిసేందుకు అపాయిట్మెంట్ అడుగుతా: జగ్గారెడ్డి

Jagga Reddy: ఉద్యోగుల భర్తీని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Arun Chilukuri
Published on: 9 March 2022 5:22 PM IST
Congress MLA Jagga Reddy Says Thanks To CM KCR Over Announcement On Job Recruitment
X

రేపు సీఎంను కలిసేందుకు అపాయిట్మెంట్ అడుగుతా: జగ్గారెడ్డి

Jagga Reddy: ఉద్యోగుల భర్తీని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. 91వేల ఉద్యోగాలను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ అనుబంధ సంఘాలు NSUI, యూత్ కాంగ్రెస్ ధర్నాలు చేపట్టాయని గుర్తుచేశారు. ఈరోజు ఈ ఫలాలు వస్తున్నాయి అంటే.. సోనియా, రాహుల్ గాంధీ పాత్ర కీలకమన్నారు. రేపు సీఎంను కలిసేందుకు అపాయిట్మెంట్ అడుగుతానన్నారు. హౌసింగ్ డిపార్ట్మెంట్‌ను రీ ఓపెన్ చేయాలని సీఎంను కోరతానని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story