మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై జగ్గారెడ్డి ప్రశంసలు

Jagga Reddy: టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేది లేదంటూనే ఆపార్టీపై నిత్యం ప్రశంసల జల్లు కురిపించే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

Arun Chilukuri
Published on: 4 March 2022 8:53 PM IST
Congress MLA Jagga Reddy Praises CM KCR
X

మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై జగ్గారెడ్డి ప్రశంసలు

Jagga Reddy: టీఆర్‌ఎస్‌లోకి వెళ్లేది లేదంటూనే ఆపార్టీపై నిత్యం ప్రశంసల జల్లు కురిపించే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సదాశివపేట మున్సిపాలిటీలో అధికారులతో రివ్యూ నిర్వహించిన జగ్గారెడ్డి పార్టీలకు అతీతంగా సీఎం కేసీఆర్ నిధులు కేటాయించారని తెలిపారు. నిధులు దుర్వినియోగం కాకుండా మంజూరు విషయంలో అవకతవకలు జరగకుండా చూడాలన్నారు జగ్గారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story