సీఎం కేసీఆర్​పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆ ముద్రను తొలగించుకోవడానికే కేసీఆర్​ ప్రయత్నం అంటూ..

MLA Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 3:16 PM IST
Congress MLA Jagga Reddy Comments On CM KCR Mumbai Tour
X

సీఎం కేసీఆర్​పై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆ ముద్రను తొలగించుకోవడానికే కేసీఆర్​ ప్రయత్నం అంటూ..

MLA Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ కూటమి చీల్చాలని కేసీఆర్ అనుకున్నా అది అయ్యేపని కాదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలవడం ముఖ్యమైన అంశమేనని, అయితే మహారాష్ట్ర సీఎం కాంగ్రెస్‌తోనే ఉన్నారు కదా అని జగ్గారెడ్డి గుర్తుచేశారు.

బీజేపీతో నేరుగా కొట్లాడుతున్నది తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమేనని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం నుంచి బయటపడేందుకే కేసీఆర్ కొత్త ఎత్తుగడ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. రైతు ఉద్యమకారుడు టికాయత్ కూడా కేసీఆర్ బీజేపీ మనిషేనని చెప్పారని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story