Jagga Reddy: బీఆర్ఎస్ ప్రకటన ఓ కామెడీ ప్రకటన లానే ఉంది

Jagga Reddy: చిత్తశుద్ది ఉంటే మీకున్న 16 స్థానాలను గెలింపించుకోండి

Rama Rao
Updated on: 11 Jun 2022 4:15 PM IST
Congress MLA Jagga Reddy Comments on CM KCR | TS News
X

Jagga Reddy: బీఆర్ఎస్ ప్రకటన ఓ కామెడీ ప్రకటన లానే ఉంది

Jagga Reddy: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ముసుగులో బీజేపీకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దేశంలో కాంగ్రెస్ చచ్చిపోయిందన్న కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన ‎ టీఆర్ఎస్ పనైపోయిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ సచ్చిపోయింది అంటే బీజేపీ బతికున్నట్టా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి 57 మంది ఎంపీలున్న కాంగ్రెస్ సచ్చిపోతే 8 మంది ఎంపీలు ఉన్న మీరు బతికున్నట్లా అని ప్రశ్నించారు.

శరద్ పవర్, స్టాలిన్, మమత బెనర్జీ, దేవెగౌడ దగ్గర కాంగ్రెస్ సచ్చిపోయింది అని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లైన్ తప్పిపోతున్నాడు మున్ముందు దాని ప్రభావం చూస్తారన్నారు. ఉన్న సీట్లలో ఎంపీలు గెలిపించుకోలేని కేసీఆర్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్లి చేసేదేమీ లేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story