Congress: రాజీవ్‌ సద్భావన దినోత్సవం సందర్భంగా చార్మినార్‌ వద్ద కాంగ్రెస్ సభ

వీరప్ప మొయిలీకి రాజీవ్‌ సద్భావన అవార్డు ప్రదానం

Sandeep Eggoju
Published on: 19 Oct 2021 5:02 PM IST
Congress Meeting at Charminar On The Occasion of Rajiv Sadbhavana Diwas
X

రాజీవ్ సద్భావ్ దినోత్సవం సందర్బంగా చార్మినార్ వద్ద కాంగ్రెస్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

Congress: దేశ సమైక్యత, సమగ్రత కోసం దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాజీవ్‌ సద్భావన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని చార్మినార్‌ వద్ద నిర్వహించిన సభలో రేవంత్ పాల్గొన్నారు. దేశ సమైక్యత కోసం కాంగ్రెస్ నేతలు ప్రాణాలు అర్పించారన్నారు. కానీ నేడు అధికారం కోసం కొందరు రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి, కర్ణాటక మాజీ సీఎం వీరప్ప మొయిలీకి రాజీవ్‌ సద్భావన అవార్డు అందజేశారు. దేశంలోనే తొలిసారిగా మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన మొదటి సీఎం వీరప్ప మొయిలీ అని రేవంత్‌ కొనియాడారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story