తెలంగాణలో రాచరిక పాలన నడుస్తుంది.. కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్

తెలంగాణలో రాచరిక పాలన నడుస్తుంది.. కేసీఆర్ పై కాంగ్రెస్ నేతలు ఫైర్
x
Highlights

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా పలువురు నేతలు ప్రధాన...

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ సహా పలువురు నేతలు ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగం పై ఫిర్యాదు చేసామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో అక్రమ కేసులు పెట్టి టీఆర్ఎస్ బెదిరింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , విప్ గంప గోవర్దన్, ఎంపీ బిబిపాటిల్, ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, కేసీఆర్ తన కుమార్తె కోసం కరొనాను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహింస్తున్నారని అన్నారు.

పోలీస్ కానిస్టేబుల్ అధికారి కరొనాతో మృతి చెందింతే అనాధ శవంలా అంత్యక్రియలు చేశారని మండిపడ్డారు. కరొనా కోసం డ్యూటీ చేసి చనిపోతే కనీసం హోంమంత్రి పరామర్శించలేదని ఆయన విమర్శించారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అదుకొని-నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కౌంటర్లు తెర్వలేదు కానీ-పార్టీ ఫిరాయింపుల కోసం కౌంటర్లు తెరిచారని ఎద్దేవా చేశారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి- గంప గోవర్ధన్- బీబీ పాటిల్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కేసీఆర్ కుటుంబానికి పోరాటం జరుగుతోందని రేవంత్ రెడ్డి అన్నారు.

ఎంపీ ఎన్నికల్లో కవితను ప్రజలు ఓడగొట్టినా కేసీఆర్ ఎమ్మెల్సీగా కవితకు అవకాశం ఇస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. ఇతర పార్టీల నేతలపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. డబ్బులు ఆశచూపి నేతలను వలవేసి పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారని, కేసీఆర్ కి కొరొనా కంటే కవితనే ముఖ్యమాని దుయ్యబట్టారు. కరొనాను పక్కకు పెట్టి కవిత కోసం టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలో మోడీకి ఆయన కుర్చీ-తెలంగాణలో కేసీఆర్ కి తన కూతురి రాజకీయం తప్ప వేరే ధ్యాస లేదని షబీర్ అలీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోంది కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories