Revanth Reddy: Gas, GST పెట్రోల్ ధరల మీద దృష్టి మరల్చడానికే...

*దేశం కోసం సోనియాగాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు

Rama Rao
Published on: 22 July 2022 6:52 AM IST
Congress Leaders a Dharna in Front of Hyderabad ED Office
X

Revanth Reddy: Gas, GST పెట్రోల్ ధరల మీద దృష్టి మరల్చడానికే... 

Revanth Reddy: Gas, GST పెట్రోల్ ధరల మీద తాము పోరాటం చేస్తుంటే ఈ విషయాన్ని పక్క దారి పట్టించేందుకు సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీని ఈడీ అధికారులు విచారించడాన్ని నిరిసిస్తూ కాంగ్రెస్ నేతలు హైద్రాబాద్ ఈడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశం కోసం సోనియాగాంధీ కుటుంబం అనేక త్యాగాలు చేసిందన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ తన ప్రాణాలను అర్పించిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఎలా హత్యకు గురయ్యారో రేవంత్‎రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story