Telangana: నాపై అటాక్‌ చేస్తే పరిస్థితి ఏంటి..?-వీహెచ్‌

VH:కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samba Siva Rao
Published on: 19 Feb 2021 6:43 PM IST
Vh Comments on Vamanrao death Case
X

వీహెచ్ (TheHansIndia)

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్(VH) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలు కనపడుతున్నాయని అన్నారు. లాయర్ వామన్ రావు హత్య కేసులో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని పలుమార్లు కోరానని, కానీ.. పట్టించుకోవడంలేదని చెప్పారు. రేపు తనపై కూడా ఇలానే ఎవరైనా దాడి చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

మరోవైపు..లాయర్ దంపతుల(VamanRao) హత్యకు పాల్పడిన దుండగులకు బిట్టు శ్రీను ఆయుధాలను, వాహనాలను సప్లై చేశాడనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిట్టు శ్రీను మాజీ ఎమ్మెల్యే, జడ్పీచైర్మన్ పుట్ట మధుకు స్వయానా మేనల్లుడుగా తెలుస్తోంది. వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పటి నుంచీ బిట్టు కనిపించకుండా పోవడంతో అతడిపై వచ్చిన ఆరోపణలు మరింత బలపడ్డాయి. ఇలాంటి సమయంలో బిట్టునపు అరెస్ట్ చేసిన పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలను కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story