ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‎కు ఢిల్లీ నుంచి పిలుపు

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‎కు ఢిల్లీ నుంచి పిలుపు
x
Highlights

తెలంగాణ పీసీసీ రేస్ ర‌స‌వ‌త్తరంగా మారింది. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో మరింత కాకరేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నేతల అభిప్రయాలను తెలుసుకున్న పార్టీ...

తెలంగాణ పీసీసీ రేస్ ర‌స‌వ‌త్తరంగా మారింది. ఈ పంచాయతీ ఢిల్లీకి చేరడంతో మరింత కాకరేపుతోంది. ఇటీవలే కాంగ్రెస్ నేతల అభిప్రయాలను తెలుసుకున్న పార్టీ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ అధిష్టానానికి ఇచ్చిన నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే తరుణంలో పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు వరుసగా హస్తిన బాట పడుతున్నారు.

టీపీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పోటీపడుతున్న ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ బాటపట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే సోనియాతో భేటీ అవ్వగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీతో సమావేశం కావడం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవనుండటంతో టీపీసీసీ చీఫ్ రేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఊహించని విధంగా మరో కాంగ్రెస్ నేత ఢిల్లీ పయనమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ను అధిష్టానం హస్తినకు ఆహ్వానించింది. దాంతో, టీపీసీసీ అధ్యక్ష పోరులో మరో పేరు చేరినట్లు అయింది. అయితే, ఇప్పటికే పదవి తమదంటే తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టి లాబీయింగ్ మొదలుపెట్టడంతో ఈ పదవి ఎవరికి దక్కుతుందనే అంశం ఆసక్తికరంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories