నిరసన తెలుపుతున్న రైతులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు : పొన్నం ప్రభాకర్

X
Highlights
వ్యవసాయ వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న రైతులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది....
Arun Chilukuri30 Nov 2020 12:45 PM GMT
వ్యవసాయ వ్యతిరేక బిల్లును వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న రైతులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే బీజేపీ ఆలోచనను వ్యతిరేకిస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
రైతులపై చేసిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పొన్నం ప్రకటించారు. ఎన్నికలు రాగానే ప్రతి రాష్ట్రంలో నాయకులపై రైడ్స్ చేసే కేంద్ర సంస్థలు ఇప్పుడు కేసీఆర్‌పై ఎందుకు రైడ్స్ చేయడం లేదంటూ కేంద్రాన్ని పొన్నం ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెప్పారని సన్నాలు వేశారని.. ఇప్పుడు వీటిని కొనే పరిస్థితి లేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రతీ గింజను కొనే వరకు టీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తుందన్నారు.
Web TitleCongress Leader Poonam Prabhakar fires on bjp
Next Story