Ponnala Lakshmaiah: రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపని తెలంగాణ ద్రోహి కేసీఆర్

Ponnala Lakshmaiah: కాళేశ్వరం నుంచి 50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడానికి సీఎం కేసీఆర్‌కి సిగ్గుండాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.

Arun Chilukuri
Published on: 5 July 2021 5:42 PM IST
Congress Leader Ponnala Lakshmaiah Slams on CM KCR
X

పొన్నాల లక్ష్మయ్య(ఫైల్ ఇమేజ్ )

Ponnala Lakshmaiah: కాళేశ్వరం నుంచి 50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడానికి సీఎం కేసీఆర్‌కి సిగ్గుండాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నుంచి 50లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్లు కేసీఆర్ నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. కృష్ణా జలాల‌పై ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించకుండా సన్యాసిలా ఎందుకు మాట్లాడుతున్నావని పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు. ఏడాదిగా రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపని తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ శిశుపాలునికి మించిన తప్పులు చేశారని. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలేనని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story