Mallu Ravi: ఇతర రాష్ట్రాల్లో సరే.. తెలంగాణలో మాటేంటి.. కొండారెడ్డిపల్లి జవాన్‌ కుటుంబానికి న్యాయం ఎప్పుడు?

Mallu Ravi: బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం చేయడాన్ని కాంగ్రెస్‌ నేత మల్లు రవి తప్పుబట్టారు.

Arun Chilukuri
Updated on: 31 Aug 2022 7:45 PM IST
Mallu Ravi Slams Cm KCR Patna Tour
X

Mallu Ravi: ఇతర రాష్ట్రాల్లో సరే.. తెలంగాణలో మాటేంటి.. కొండారెడ్డిపల్లి జవాన్‌ కుటుంబానికి న్యాయం ఎప్పుడు? 

Mallu Ravi: బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఆర్మీ కుటుంబాలకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం చేయడాన్ని కాంగ్రెస్‌ నేత మల్లు రవి తప్పుబట్టారు. ఇతర రాష్ట్రాల ఆర్మీ కుటుంబాలకు సాయం చేస్తున్న కేసీఆర్‌.. తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ల కుటుంబాలను ఎందుకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. 9ఏళ్ల క్రితం కొండారెడ్డిపల్లికి చెందిన యాదయ్య బోర్డర్‌లో విధులు నిర్వహిస్తూ చనిపోయాడని, ఇప్పటివరకు ఆ కుటుంబానికి ఎలాంటి సాయం అందలేదన్నారు. యాదయ్య కుటుంబానికి తక్షణమే సాయం చేయాలని డిమాండ్ చేశారు మల్లు రవి. ప్రభుత్వం స్పందించక పోతే నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయము ముందు సత్యాగ్రహ దీక్షచేస్తానన్నారు మల్లు రవి. అమర జవాన్ యాదయ్య భార్య.. పిల్లలు గాంధీ భవన్ కి వచ్చి కాంగ్రెస్ నేతలకు తమ ఇబ్బందుల్ని వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story