టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు.. మహేష్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు..

Mahesh Kumar Goud: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 2 Aug 2022 6:18 PM IST
Congress Leader Mahesh Kumar Goud Sensational Comments
X

టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు మాతో టచ్ లో ఉన్నారు.. మహేష్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు.. 

Mahesh Kumar Goud: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారన్న ఆయన వాళ్లంతా త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరికలపై నెల రోజుల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయని స్పష్టం చేశారు మహేష్‌ గౌడ్‌. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు 70 స్థానాలు పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇక రాజగోపాల్‌ వ్యవహారాన్ని ఏఐసీసీ పరిశీలిస్తోందని చెప్పారు. హై కమాండ్‌ పిలుపుతో ఈ నెల 5న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద పెద్దఎత్తున నిరసన చేపడుతున్నట్టు తెలిపారు మహేష్‌ గౌడ్. నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదల, అగ్నిపథ్‌, పంట నష్టంపై ఈ నిరసన చేపడుతున్నట్టు స్పష్టం చేశారు మహేష్‌ గౌడ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story