Jagga Reddy: విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపారు

Jagga Reddy: వైఎస్‌ విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు టీ.కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి.

Arun Chilukuri
Published on: 31 Aug 2021 7:21 PM IST
Congress Leader Jagga Reddy Slams YS Vijayamma
X

Jagga Reddy: విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపారు

Jagga Reddy: వైఎస్‌ విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు టీ.కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. రాజశేఖర్‌ రెడ్డి పేరుతో ఏపీలో ముఖ్యమంత్రిగా జగన్‌ను కూర్చొబెట్టారన్నారు ఆయన. ఇప్పుడు అభిమానం పేరుతో తెలంగాణలో రాజకీయ డ్రామ చేస్తున్నారన్నారు. షర్మిల తెలంగాణ కొడలే అని.. కానీ విజయమ్మ ఏమవుతుందని ప్రశ్నించారు. ఏపీలో కొడుకు జగన్‌ను సీఎం సీటులో కూర్చోబెట్టి.. బీజేపీతో దోస్తాన చేస్తున్నారని ఆరోపించారు. కూతురు షర్మిలతో కలిసి విజయమ్మ.. తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని చెప్పారు. అటు బీజేపీ, మజ్లిస్‌ మత రాజకీయాలు చేస్తున్నాయన్న జగ్గారెడ్డి టీఆర్ఎస్‌ పాలనలో గంజాయి రవాణా విచ్చలవిడిగా జరుగుతుందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story