రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో: వి.హెచ్

Arun Chilukuri
Published on: 13 Aug 2020 4:08 PM IST
రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో: వి.హెచ్
X

congress leader hanumantha rao fires on mp revanth reddy: రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హనుమంతరావు వ్యాఖ్యలు యధావిధిగా.. నలభై ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇటువంటి వారిని చూడలేదు. రేవంత్ రెడ్డి నీ పద్దతి మార్చుకో కొత్త బిక్షగాడిలా వ్యవహారంచేయకు, నీ అనుచరుల ద్వారా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఆపాలి. నేనే కాబోయో ముఖ్యమంత్రిని అని గతంలో ఎవరు చెప్పుకోలేదు. మాలాంటి సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగొలు కామెంట్స్ చేస్తున్నారు.

మేమంతా పిచ్చోల్లము కాదు. మమ్మల్ని కించ పరిచే చర్యలు ఆపాలి. పార్టీ అంతర్గత అంశం గా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నాము. ప్రియాంక గ్రూపులో చేరాము అని కొత్త ప్రచారం చేసుకుంటున్నారు. సోనియా గాంధీకి వయసు మీరింది, రాహుల్ గాంధీ సైడ్ అయ్యారు అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ గాంధీ కుటుంబాన్ని కూడా చీల్చుతున్నారు. పదవులు అన్ని మికేనా బిసిలు ఓట్ల మిషన్లు కాదు. వెంటనే పిసిసి కోర్ కమిటీ సమావేశం పెట్టాలని డిమాండ్ చేస్తున్న, మా ఓపికకు పరీక్ష పెట్టొద్దు. సోషల్ మీడియా లో పెట్టిన పోస్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అని ఆయన అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story