Telangana Budget 2021: అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: భట్టి

Telangana Budget 2021: బడ్జెట్ సమావేశాలంటే ప్రభుత్వానికి నవ్వులాటగా మారిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

Arun Chilukuri
Published on: 15 March 2021 5:01 PM IST
Congress Leader Bhatti Vikramarka Slams TRS Govt
X

ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )

Telangana Budget 2021: బడ్జెట్ సమావేశాలంటే ప్రభుత్వానికి నవ్వులాటగా మారిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. విస్తృతంగా చర్చ జరగాల్సిన బడ్జెట్ సమావేశాల్ని ఆరు రోజులకు కుదించడంపై మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని శాసనసభ విధివిధానాలు పాటించాలన్నారు భట్టి.

గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో పస లేదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గవర్నర్ ప్రసంగంలో ఆరేళ్లుగా చెప్పిందే చెపుతున్నారన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏం చేసింది..? ఏం చేయబోతుందనే అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవని కొత్త వ్యవసాయ చట్టాలు, నిరుద్యోగ భృతి అంశాల్ని ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story