Bhatti Vikramarka: పల్లెపల్లెనా మద్యంషాపులు మస్తుగా పెరిగాయి

Bhatti Vikramarka: పెరిగిన మద్యం షాపులతో యువత జీవితం చిత్తవుతోంది

Rama Rao
Updated on: 12 Jun 2022 9:31 PM IST
Congress Leader Bhatti Vikramarka Mahapadayatra in Khammam
X

Bhatti Vikramarka: పల్లెపల్లెనా మద్యంషాపులు మస్తుగా పెరిగాయి

Bhatti Vikramarka: తెలంగాణలో అభివృద్ధి కనుచూపుమేరలో కానరాలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విచారం వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధికి దూరమైనా మద్యంవ్యాపారంమాత్రం మస్తుగా జరుగుతోందన్నారు. జనం జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్ధేశంతో పీపుల్స్ మార్చ్ తలపెట్టానని విక్రమార్క ప్రస్తావనకు తెచ్చారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంజిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల చేరుకుంది. ఈ సందర‌్భంగా వైఎస్‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని కాగితాల్లో రాసిస్తే వాటిని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారంకోసం పోరాడుతామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story