సభలో సాంప్రదాయాలను పట్టించుకోవట్లేదు : భట్టి విక్రమార్క

సభలో సాంప్రదాయాలను పట్టించుకోవట్లేదు : భట్టి విక్రమార్క
x

 Bhatti Vikramarka

Highlights

Telangana Assembly Sessions : రెవెన్యూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్‌లో చాలా త‌ప్పులున్న‌యని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ఆన్నారు..

Telangana Assembly Sessions : రెవెన్యూ పరిపాలన వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ధరణి వెబ్‌సైట్‌లో చాలా త‌ప్పులున్న‌యని సీఏల్పీ నేత భట్టి విక్రమార్క ఆన్నారు.. ఈ తప్పులను సరిచేయకుండా ప్రభుత్వం మళ్ళీ తప్పులను చేస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందని అన్నారు. ఒకరి భూమిని మరోకరు ధరణి వెబ్ సైట్ లో ఎంట్రీ చేసుకుంటే..అసలైన పట్టాదారు తనపై భూమిని ఏంట్రీ చేయించాలంటే ధరణి వెబ్ సైట్ లోకి తీసుకోవడం లేదని అన్నారు.

అయితే దీనిపైన సభలో క్లారిఫికేషన్ అడిగినా ఇవ్వట్లేదని బట్టి అన్నారు. అంతేకాకుండా సభలో సాంప్రదాయాలను పట్టించుకోవట్లేదని, ప్ర‌తిప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం కూడా చెప్ప‌లేక‌పోతున్న‌ర‌ని అయన ఆరోపించారు. అటు ఆర్ధిక మంత్రి హరీష్ రావు పైన కీలక వ్యాఖ్యలు చేశారయన.. హరీష్ రావుకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే దుబ్బాకలో మకాం వేశాడని బట్టి అన్నారు.

అటు కవిత ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకే రేపు మండలి సమావేశాలు పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బిల్లుల ఆమోదం కోసమే సభ అన్నట్లు గా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. వర్షాలతో రైతులు నష్టపోయి తీవ్ర దుఃఖంతో ఉంటే వారికి దైర్యం చెప్పే పనిని ప్రభుత్వం చేయడం లేదని అన్నారు. పదే పదే 50శాతం రిజర్వేషన్లు అని చెప్తున్న కేటీఆర్ మీ మొదటి ప్రభుత్వంలో ఓక్క మహిళా మంత్రి కూడా లేదని సీతక్క పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories