కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అద్దంకి దయాకర్‌ క్షమాపణలు

Addanki Dayakar: నిన్న చండూరు సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.

Arun Chilukuri
Published on: 6 Aug 2022 6:20 PM IST
Congress Leader Addanki Dayakar Apologies To Komatireddy Venkat Reddy
X

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అద్దంకి దయాకర్‌ క్షమాపణలు

Addanki Dayakar: నిన్న చండూరు సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఆ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరారు. అలాగే వెంకట్‌రెడ్డి అభిమానులకు కూడా క్షమాపణ చెప్పారు దయాకర్. పార్టీకి నష్టం జరగొద్దనే ఆ వ్యాఖ్యలు చేశాను తప్ప వెంకట్ రెడ్డిని విమర్శించాలని కాదన్నారు. తెలంగాణలో ఆ పదాన్ని కామన్ గా వాడుతారన్న ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కాగ అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ అద్దంకి దయాకర్ కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story