Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 11:53 AM IST
Congress High Command Serious on MLA Jagga Reddy
X
జగ్గారెడ్డి పై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ (ఫైల్ ఇమేజ్)

Jagga Reddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ‌్యలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలో సాయంత్రం గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంశాన్ని సీరియస్‌గా చర్చించాలని మాణిక్కం ఠాకూర్ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

సాయంత్రం జరిగే పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశంలో ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ పార్టీ నేతల్లో నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమానికి వెళ్లేటప్పుడు ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌ రేవంత్‌దే అంటున్నారు సీనియర్లు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story