Congress: భట్టికి కాంగ్రెస్ హైకమాండ్‌ పిలుపు

Congress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది.

Arun Chilukuri
Published on: 1 July 2021 3:38 PM IST
Congress High Command Call to Bhatti Vikramarka
X

భట్టి విక్రమార్క(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Congress: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. దాంతో, భట్టి విక్రమార్క హుటాహుటినా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అయితే, టీపీసీసీ న్యూ చీఫ్ నియామకం తర్వాత భట్టి సైలెంట్‌ కావడంతో బుజ్జగించేందుకు ఢిల్లీకి పిలిచినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త పీసీసీ చీఫ్ నియామకం తర్వాత భట్టికి అధిష్టానం నుంచి పిలుపు రావడం చర్చంశనీయమైంది. కొందరు సీనియర్లు టీపీసీసీ అధ్యక్షుడి ఎంపిక పట్ల అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. టీపీసీసీ.. టీడీపీ పీసీసీగా మారుతుందంటూ.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. భట్టి మాత్రం మౌనంగానే ఉన్నారు. మరి కొంత మంది సీనియర్లు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశముందని సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story