Congress: అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్‌

Congress: సెప్టెంబర్‌ 4న ఉదయం 10 గంటలకు టీపీసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం

Shekhar G
Updated on: 31 Aug 2023 8:15 PM IST
Congress Has Intensified The Exercise On The List Of Candidates
X

Congress: అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్‌ 

Congress: అభ్యర్థుల జాబితాపై కసరత్తు ముమ్మరం చేసిన కాంగ్రెస్‌.. సెప్టెంబర్ 3న పీఈసీ, 4న స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించనుంది. ఇప్పటికే తొలి దఫా పీఈసీ సమావేశం జరగ్గా.. సామాజిక వర్గాల ఆధారంగా పీఈసీ ఇచ్చిన లిస్ట్ లేదని అభ్యంతరాలు వచ్చాయి. దీంతో రెండో దఫా సమావేశం నిర్వహిస్తోంది పీఈసీ. అయితే ఈ దఫాలో దరఖాస్తు చేసిన వ్యక్తి పార్టీలో ఎప్పుడు చేరారు..? దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గంలో వ్యక్తి చేసిన పార్టీ కార్యకలాపాలు లాంటి వివరాలతో స్క్రూటినీ జరపనుంది కమిటీ. అనంతరం సెప్టెంబర్‌ 4న ఉదయం టీపీసీసీ స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పీఈసీ సభ్యులతో వన్‌ టు వన్‌ మాట్లాడనున్నారు.. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్‌.

Shekhar G

Shekhar G

Next Story