Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడుతుంది

Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలి

Shekhar G
Published on: 2 Jan 2024 5:26 PM IST
Congress Government Trying To Protect Former Cm KCR To Kaleshwaram Project Says Kishan Reddy
X

Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడుతుంది

Kishan Reddy: మాజీ సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కాళేశ్వరంపై విచారణ కోరుతూ.. కేంద్రానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. విచారణ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌కు మేలు చేసేలా వ్యవహరిస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయేలా ఉందన్నారు. మజ్లీస్‌ పార్టీ మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరించిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలన్నారు. 48 గంటల్లోగా సీబీఐతో విచారణ జరిపించే బాధ్యత కేంద్ర ప్రభుత్వ తీసుకుంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story