కాంగ్రెస్‌ ప్రయత్నాలు విఫలం.. రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినా అంగీకరించని ఈటల?

Congress Fails to Lure Etela Rajender Despite, Revanth Reddys Trials
x

రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసినా అంగీకరించని ఈటల?

Highlights

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి..?

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నెక్ట్స్ స్టెప్ ఏంటి..? ప్రస్తుతం ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈటల బీజేపీలో చేరడం ఖాయమనే వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం ఆయనత భేటీ కావడం మరోసారి ఈటల ఎపిసోడ్‌ను సస్పెన్స్‌లో పడేసింది. అయితే దీని వెనుక కాంగ్రెస్‌ పార్టీ ప్రమేయం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు కొండా, కోదండరాంలు కలిశారని అందుకు ఆయన ససేమిరా అన్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి ఈటలను పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories