Vikarabad: వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు నిరసన సెగ

Vikarabad: మర్పల్లిలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల ఆందోళన * ఎమ్మెల్యే కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం

Sandeep Eggoju
Updated on: 8 Aug 2021 2:50 PM IST
Congress and BJP Leaders Protest in Vikarabad District
X

మెతుకుపల్లి ఆనంద్ కి నిరసన సెగ 

Vikarabad: వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌కు నిరసన సెగ తగిలింది. ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేయాలంటూ మర్పల్లిలో కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. మర్పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఆనంద్‌ కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని చెదరగొట్టారు. పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేయడంలో పోలీస్‌ స్టేషన్‌ గేటు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే తమ నియోజకవర్గానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందంటూ ఆందోళన చేపట్టారు. గత మూడేళ్లుగా ఉద్యోగాల పేరుతో.. నిరుద్యోగులను వాడుకుంటున్నారని, పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదంటూ మండిపడ్డారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని.. లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story