మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. మైక్ లాక్కున్న మంత్రి మల్లారెడ్డి..

Atmiya Sammelanam: హైదరాబాద్‌ బోడుప్పల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో వర్గ భేదాలు బయటపడ్డాయి.

Arun Chilukuri
Updated on: 16 April 2023 6:31 PM IST
Conflicts Between BRS EX MLA Sudheer Reddy and Minister Malla Reddy
X

మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. మైక్ లాక్కున్న మంత్రి మల్లారెడ్డి..

Atmiya Sammelanam: హైదరాబాద్‌ బోడుప్పల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో వర్గ భేదాలు బయటపడ్డాయి. సభలో మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆత్మీయ సమ్మేళనానికి జెడ్పీ ఛైర్మన్ శరత్‌ చంద్రారెడ్డిని పిలవకపోడంపై మంత్రి మల్లారెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు సుధీర్‌రెడ్డి.

దాంతో ఇద్దరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మంత్రి మల్లారెడ్డి.. సుధీర్‌ రెడ్డి దగ్గర నుంచి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఇద్దరు నేతలు సభలోనే ఒకరినొకరు దూషించుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story