Revanth Reddy: గొర్రెల స్కామ్‌పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు

Revanth Reddy: గత ప్రభుత్వ పెద్దలు గొర్రెల స్కీంను స్కాంగా మార్చారని..

Dhatripriya
Published on: 4 March 2024 4:54 PM IST
Complaints To CM Revanth Reddy On Sheep Scam
X

Revanth Reddy: గొర్రెల స్కామ్‌పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదులు

Revanth Reddy: తెలంగాణలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలమపై ఫిర్యాదులు కొనసాగుతూ ఉన్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వెటర్నరీ డాక్టర్ల సంఘం మాజీ అధ్యక్షుడు పెంటయ్య కంప్లైంట్ చేశారు. గత ప్రభుత్వ పెద్దలు గొర్రెల స్కీంను స్కాంగా మార్చారని తెలిపారు. మాజీ డైరెక్టర్ రామచందర్ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు.

స్కీమ్‌ యూనిట్ కాస్ట్ పెంచి స్కామ్‌గా మార్చి... పశుసంవర్ధక శాఖ పరువు, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు పెంటయ్య. వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం చేసిన రామచందర్‌ను తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించాలన్నారు. దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని.. బోగస్‌ కంపెనీలపై ఇంటర్నల్‌ ఎంక్వైరీ జరిపించాలని సీఎం రేవంత్‌ను కోరారు పెంటయ్య.

Dhatripriya

Dhatripriya

Next Story