కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు

దుండగలను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 Sept 2024 7:24 PM IST
Complaint to Cyberabad CP about attack on Kaushik Reddy house
X

కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు

కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయానికి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. భారీ ఎత్తున బీఆర్ఎస్ నేతలు రావడంతో.. కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో.. కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడి ఘటనపై సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.

దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని.. డిమాండ్ చేస్తూ.. ఆందోళన నిర్వహించారు. అరెస్ట్ చేసి F.I.R కాపీ ఇవ్వాలని.. అప్పటివరకూ వరకూ కార్యాలయం వదిలి వెళ్లేదే లేదని కార్యాలయం ముందు భైఠాయించారు. తమకు న్యాయం జరగకపోతే.. కోర్టుకు వెళ్తామని... అవసరమైతే... సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని హరీష్‌రావు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story