BJP: బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పొన్నంపై ఫిర్యాదు

BJP: కరీంనగర్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 May 2024 8:30 PM IST
Complaint against Ponnam for making inappropriate comments on the Bandi Sanjay
X

BJP: బండిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పొన్నంపై ఫిర్యాదు

BJP: బండి సంజయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై రిటర్నింగ్ అధికారికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ... ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న పొన్నం ప్రభాకర్‌పై ఎన్నికలు ముగిసే వరకు ప్రసంగాలు, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా నిషేధం విధించాలని ఆర్వోను కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story