logo
తెలంగాణ

Telangana: మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ

Competition in the TRS for Three Rajya Sabha Seats | TS News Today
X

మూడు రాజ్యసభ స్థానాలకు టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ

Highlights

Telangana: రాజ్యసభ ఆశిస్తున్న 10మంది నేతలు

Telangana: తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వచ్చే జూన్ నాటికి కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్, బండ ప్రకాష్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్‌లో రాజ్యసభ సీటు కోసం ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ తనకు ఉపయోగపడే నేతలను ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేయడం కేసీఆర్‌కు కత్తిమీద సాములా మారింది. ఎవరికి రాజ్యసభ సీటు కట్టబెట్టినా మిగతా వారు తీవ్ర అసంతృప్తికి గురవుతారు. పార్టీలో సుమారు 10మంది వరకు రాజ్యసభ స్థానం ఆశిస్తున్నారు. ఇందులో కొందరు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులతో పాటు గతంలో రాజ్యసభ రాజ్యసభ స్థానం ఇస్తామని హామీ ఇచ్చిన వారు ఉన్నారు. వీరంతా ఇప్పుడు తమకు రాజ్యసభ ఛాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

సిట్టింగ్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీఎస్‌లకు మళ్లీ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని ఉప ఎన్నికతో భర్తీ చేయక తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, వేణుగోపాలచారి, జూపల్లి కృష్ణారావు, మంద జగన్నాధంలు రాజ్యసభ ఆశిస్తున్నా... అవకాశం ఇస్తారా లేదా అనే ఉత్కంఠ సాగుతోంది

కేసీఆర్ ముంబై పర్యటనలో హడావుడి చేసిన నటుడు ప్రకాష్ రాజ్ పేరు కారు పార్టీలో చర్చ సాగుతోంది. పార్టీతో సంబంధం లేని ప్రకాష్ రాజ్ జాతీయ స్థాయిలో పనికి వస్తారా అనే చర్చ నడుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ బోయిన్‌పల్లి వినోద్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉందంటున్నారు. ఇటు ఎమ్మెల్సీగా ఉన్న కవితను రాజ్య సభ ఎంపీగా పంపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీలోకి వెళ్లిన వివేక్ వెంకటస్వామికి గులాబీ కండువా కప్పి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.


Web TitleCompetition in the TRS for Three Rajya Sabha Seats | TS News Today
Next Story