క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలు, నిర్ధారణ నియమాలు పాటించాలి: కలెక్టర్ కె.శశాంక్

క్షేత్రస్థాయిలో నాణ్యతా ప్రమాణాలు, నిర్ధారణ నియమాలు పాటించాలి: కలెక్టర్ కె.శశాంక్
x
Highlights

క్షేత్రస్థాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతా ప్రమాణాలు, నిర్దారణ నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.

కరీంనగర్ టౌన్: క్షేత్రస్థాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యతా ప్రమాణాలు, నిర్దారణ నియమాలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. సోమవారం నాడు వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వీడీయో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్నందున కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచి రైతులకు నష్టం జరుగకుండా చూడాలని, అలాగే నోడల్ అధికారిగా ఉన్న సహకార సంఘాలు కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా, ఆయా కేంద్రాలలో ఎలాక్ట్రానిక్ కాంటాలు ఎన్ని అందుబాటులో ఉన్నవి, అక్కడ కల్పిస్తున్న వసతులను పరిశీలించాలని ఆయన అన్నారు.

అంతేగాక కరోనా వైరస్ నేపథ్యంలో, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని సత్వరమే దిగుమతి చేసుకునేలా చూడాలని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. వరి ధాన్యం కోత మిషన్ల జిల్లా లో తగు సంఖ్యలో అందుబాటు ఉన్నాయని, రైతులు ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా కోతలు ముంగించుకొని, తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన కోరారు. మండల వ్యవసాయ అధికారులు జారీ చేసే టోకెన్లు ప్రకారం, కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.

రైతులు తమ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తర్వాత రైతులకు నాణ్యత ధృవీకరణ పత్రం వ్యవసాయ విస్తరణ అధికారి ఇవ్వాలని అన్నారు. రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్రం ఇంచార్జి ఆ సర్టిఫికెట్ ను రైస్ మిల్లరకు పంపించాలని, రైతుల నుండి ధాన్యం శాంపిల్స్ తప్పకుండా సేకరించాలని అన్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిశుభ్రత పాటించడంతో పాటు మాస్కులు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించే విధంగా చూడాలని, అలాగే మంచి నీరు, విద్యుత్ సదుపాయాలని ఆయన అన్నారు. ఈ వీడీయో కాన్ఫరెన్సు లో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా సహకార అధికారి సి.హెచ్ మనోజ్ కుమార్, జిల్లా వ్యవసాయ జిల్లా అధికారి వి. శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్ రావు, పౌర సరఫరాల సంస్థ డి ఏం శ్రీకాంత్, డి.ఎస్.వో సురేష్ రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories