జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింక

Jubilee Hills: ఏబీఎస్ బార్బిక్యూ రెస్టారెంట్‌‌లో కస్టమర్‌కు షాక్

Jyothi
Updated on: 10 Jan 2024 8:46 AM IST
Cockroach in Biryani at Jubilee Hills Restaurant
X

జూబ్లీహిల్స్ రెస్టారెంట్‌లో బిర్యానీలో బొద్దింక

Jubilee Hills: జూబ్లీహిల్స్ బిర్యానీ రుచి చూడటానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్డర్ చేసిన బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఇదేంటని నిలదీస్తే.. దిక్కున్న చోట చెప్పుకోమని నిర్వాహకులు ఎదురుదాడికి దిగారు. ఎవరైనా హైదరాబాద్ వచ్చారంటే.. టేస్టీ బిర్యానీ ఎక్కడ దొరుకుతుందని ఆరా తీస్తారు. నగరం నుంచి ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్లాల్సినా.. బిర్యానీ టేస్ట్ చూసి బయలుదేరుతారు. హైదరాబాద్ బిర్యానీకి ఉన్న గుర్తింపు అలాంటిది.

జూబ్లీహిల్స్ ఏ బి ఎస్ బార్బిక్యూ అనే రెస్టారెంట్‌కు ఇలాగే ఇద్దరు వ్యక్తులు బిర్యానీ రుచి చూడటానికి వెళ్లారు. వారు ఆర్డర్ చేసిన బిర్యానీ చూస్తే కడుపులో తిప్పినట్లయింది. బిర్యానీలో బొద్దింక రావడమే అందుక్కారణం. ఇదేంటని నిర్వాహకులను నిలదేస్తే.. దిక్కున్న చోట చెప్పుకొమ్మని ఎదురుదాడికి దిగారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏబీఎస్ బార్బిక్యూ హోటల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కస్టమర్లు ఆర్డర్ చేసిన మటన్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. ఆగ్రహానికి గురైన కస్టమర్లు ఇలాంటి బిర్యానీ పెట్టారేంటని హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story