CM Revanth Reddy: కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy: కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
x
Highlights

CM Revanth Reddy: కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు.

CM Revanth Reddy: కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలిస్తారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌‌లో తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌కు చేరుకోని వరదలకు దెబ్బతిన్న లింగంపల్లి కుర్దు ఆర్&బీ బ్రిడ్జ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం బుడిగిడ గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. తదననంతరం కామారెడ్డి మున్సిపాలిటీలో దెబ్బతిన్న రోడ్లను, జీఆర్ కాలనీని సందర్శించనున్నారు. బాధిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడి.. వరద నష్టంపై జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించనున్నట్లు సమాచారం.

కామారెడ్డి జిల్లాలు 36.8 సెం.మీల వర్షపాతం నమోదైంది. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండు రోజుల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా.. కామారెడ్డి పట్టణ కేంద్రంలోని పెద్ద చెరువు ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కూలాయి. కల్వర్టులు కొట్టుకుపోయాయి. వాగులు పొంగాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్భందమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories