Revanth Reddy: రైతన్నకు మీ రేవంతన్న మాట.. రుణమాఫీ పథకంపై సీఎం ఆసక్తికర ట్వీట్

Revanth Reddy: నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో.. నేడు ప్రజాప్రభుత్వంలో రుణమాపీ ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 July 2024 2:05 PM IST
CM Revanth Reddy Tweet On Rythu Runa Mafi
X

Revanth Reddy: రైతన్నకు మీ రేవంతన్న మాట.. రుణమాఫీ పథకంపై సీఎం ఆసక్తికర ట్వీట్ 

Revanth Reddy: నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో.. నేడు ప్రజాప్రభుత్వంలో రుణమాపీ ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో రెండు లక్షల రూపాయల రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి... రైతన్నకు మీ రేవంతన్న మాట అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం “రైతు రుణమాఫీ పథకం” అని అన్నారు.

నాడు మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా, ఎంత కష్టమైనా.. ఎంత భారమైనా.. ఏకకాలంలో రుణమాఫీ చేసిన.. చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి, పంద్రాగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో, తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా.. మలి అడుగు విధివిధానాల ఖరారు అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో రైతు సంక్షేమ కోణం ఉంటుందని, ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అంటూ రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story