Revanth Reddy: 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం

Revanth Reddy: తెలంగాణలో విద్యా విధానంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 17 Sept 2025 2:50 PM IST
Revanth Reddy: 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యం
X

Revanth Reddy: తెలంగాణలో విద్యా విధానంపై సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలి.. గతంలో తెలంగాణ విద్య లో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ లు కీలక పాత్ర పోషించాయాని సీఎం అన్నారు. ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదన్నారు. ప్రతి సంవత్సరం 1లక్షల 10 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారు. వారి లో 15 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నరని అన్నారు.

విద్యా శాఖకు 21 వేల కోట్లు కేటాయిస్తే అందులో 98 శాతం జీతాలకే ఖర్చు అవుతుందన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని.. విద్యా విధానంలో మార్పులు తీసుకురావడంమే నా ధ్యేయమన్నారు. రాష్ట్రంలో 73 లక్షల మంది యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే నా లక్ష్యంమన్నారు. దేశ విద్య విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని.. పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక బద్దంగా పనిచేయాలని అధికారులును అదేశించారు.

11 వేల ప్రైవేట్ స్కూల్స్ లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్య కోసం తీసుకునే రుణాలను ఎఫ్ ఆర్ బీ ఎం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్ధిక మంత్రిని కోరానన్ని సీఎం తెలిపారు. 1 నుంచి 12 తరగతుల వరకు సమూల మార్పులు రావాలి. విద్య విషయంలో సమాజానికి మేలు జరుగుతుందంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకోవడానికైనా నేను సిద్ధంమని సీఎం రేవంత్ అన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story