CM Revanth Reddy: స్వయంగా ఒక మండలానికి బాధ్యత తీసుకుంటా.. ఉపాధి హామీ కుట్రపై సీఎం రేవంత్ సమరశంఖం

CM Revanth Reddy: స్వయంగా ఒక మండలానికి బాధ్యత తీసుకుంటా.. ఉపాధి హామీ కుట్రపై సీఎం రేవంత్ సమరశంఖం
x
Highlights

CM Revanth Reddy: ఉపాధి హామీ పథకం తొలగింపు కుట్రను నిరసిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో బాధ్యతలు తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: ఉపాధి హామీ పథకం తొలగింపు కుట్రను నిరసిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో బాధ్యతలు తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మండలం బాధ్యతను తానే చూసుకుంటానని రేవంత్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 3 నుంచి 9తేదీ వరకూ ఉమ్మడి జిల్లాలో భారీ బహిరంగ సభలకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.

ఇందులో భాగంగా కార్యక్రమాలు.. బహిరంగ సభల సమన్వయం బాధ్యత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూసుకుంటారని రేవంత్ తెలిపారు. పర్యావేక్షణ బాధ్యత ఇంచార్జ్‌ మీనాక్షి, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీసుకుంటారన్నారు. ములుగులో బహిరంగ సభ పెట్టి సోనియా, రాహుల్ గాంధీలను ఆహ్వానిస్తామని రేవంత్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories