Women's Day: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మరో శుభవార్త

I am very proud to be an Indian citizen CM Revanth Reddy on Operation Sindoor
x

Revanth Reddy: భారత పౌరుడిగా ఎంతో గర్వంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

Highlights

Indira Mahila Shakti Buses: మహిళా సాధికారత దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. కోటి మంది మహిళామణులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ పథకాలు ప్రారంభిస్తున్నారు.

Indira Mahila Shakti Buses

మహిళా సాధికారత దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. కోటి మంది మహిళామణులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ పథకాలు ప్రారంభిస్తున్నారు. ఇందులోభాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి8న ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించబోతోంది రేవంత్ ప్రభుత్వం. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డీఏ అమలు చేయనుంది.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించి ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 శాతం డిఏ ప్రకటించింది. 2.5 శాతం డిఏ వల్ల ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల భారం పడనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దాదాపు 5 వేల కోట్ల విలువైన ప్రయాణాన్నిమహిళలు ఉచితంగా వినియోగించుకున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభం తరువాత ప్రతి రోజూ దాదాపు 14 లక్షల మంది మహిళలు అదనంగా ప్రయాణం చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. అయినా సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు.

ఇలా ఉండగా... మంత్రి పొన్నం ప్రభాకర్ మదిలో నుంచి వచ్చిన వినూత్న ఆలోచన మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న అమలులోకి రానుంది. మహాలక్ష్మి పథకంతో మహిళా ప్రయాణికుల సంఖ్య అదనంగా పెరగడంతో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగింది. దీంతో మహిళా సమైక్య సంఘాలతో అదనపు బస్సులు కొనిపించి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫలితంగా మహిళలు ఆదాయాన్ని సంపాదిస్తారని భావించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు అధికారులతో పలుమార్లు చర్చించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటిసారి మహిళా సంఘాలతో ఆర్టీసీ బస్సులు అద్దె ప్రాతిపదికన నడిపించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఆ బస్సులకు మహిళలను యజమానులను చేస్తూ మహిళా సాధికారత దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా వివిధ పథకాలు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి ద్వారా మొత్తం 600 బస్సులు మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీతో అద్దె ప్రాతిపదికన ఒప్పందం జరిగింది. మొదటి దశలో శనివారం 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి బస్సులు మొదటి దశలో 150 మండలాల్లో.. ప్రతి మండలానికి ఒక మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సు ప్రారంభం కానుంది. పాత ఉమ్మడి జిల్లాలైన వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టు‌గా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. మండల మహిళా సమైక్యల ద్వారా కొనుగోలు చేసిన ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది. మహిళా ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తొలగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories