Hyderabad: ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన

Hyderabad: ట్రాన్స్‌జెండర్‌లకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన
x
Highlights

Revanth Reddy on Transgenders: హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం.

Revanth Reddy on Transgenders: హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. సిటీ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్‌జెండర్‌లను వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సూచించారు.

ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోమ్‌గార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్‌జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రతి నెలా వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి కొంతమేరకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని అన్నారు. అందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్​జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.

వారం, పది రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని చెప్పారు. విధుల్లో ఉండే ట్రాన్స్​జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories