Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోంది

CM Revanth Reddy Slams KCR Family Promises Jobs and Project Visits
x

Revanth Reddy: కేసీఆర్‌ కుటుంబం కడుపునిండా విషం పెట్టుకుని మాట్లాడుతోంది

Highlights

Revanth Reddy: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషంతో మాట్లాడుతోందని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

Revanth Reddy: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం కడుపునిండా విషంతో మాట్లాడుతోందని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర అభివృద్ధిపై రాచబండలా సూచనలు ఇవ్వాలని, ప్రభుత్వం వాటిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం తాను త్వరలో మహారాష్ట్రకు పర్యటనకు వెళ్లనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్‌లను మినహాయిస్తే మిగతా పాత పథకాలన్నీ యథాతథంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలు రాయడానికే పరిమితం కాకుండా, సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని సూచించారు. కేంద్రంతో సహకారం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. రాష్ట్ర పాలనలో పారదర్శకత, సమన్వయం కావాలంటే ప్రతిపక్షాలు కూడా నిర్మాణాత్మకంగా ముందుకు రావాలన్నదే రేవంత్‌ సందేశం.

Show Full Article
Print Article
Next Story
More Stories