నేటితో ముగియనున్న సీఎం రేవంత్ బృందం విదేశీ టూర్

పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన కొనసాగుతుంది. హెన్ రివర్‌ను రేవంత్ బృందం పరిశీలించింది. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Aug 2024 10:33 AM IST
CM Revanth Reddy Seoul Tour Ends
X

నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం.. వచ్చి రాగానే కాగ్నిజెంట్‌ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన నేటి అర్ధరాత్రితో ముగియనుంది. ఇవాళ రెండో రోజు దక్షిణకొరియాలోని సియోల్‌లో కీలక సమావేశం జరగనుంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం విదేశీ పర్యటన కొనసాగుతుంది. హెన్ రివర్‌ను రేవంత్ బృందం పరిశీలించింది. మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే హెన్ ప్రాజెక్టు తరహాలో అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను రేవంత్ బృందం పరిశీలించనుంది. విదేశీ పర్యటన ముగించుకుని రేపు ఉదయానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story