Revanth Reddy: రాష్ట్రంలో పన్నుల ఆదాయంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

CM Revanth Reddy Review Tax Revenue in the state with officials
x

Revanth Reddy: రాష్ట్రంలో పన్నుల ఆదాయంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

Highlights

Revanth Reddy: కమర్షియల్‌, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, రవాణా, టీఎస్‌ఎండీసీ విభాగాల్లో.. ఆదాయ సేకరణపై ఆరా తీసిన సీఎం రేవంత్‌

Revanth Reddy: రాష్ట్రంలో పన్నులు, వాటితో వచ్చే ఆదాయంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కమర్షియల్‌, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్‌, రవాణా, టీఎస్‌ఎండీసీ విభాగాల్లో ఆదాయ సేకరణపై ఆరా తీశారు. ఆర్థిక సంవత్సరాల వారీగా పన్నుల వసూళ్ల వివరాలు అడిగిన సీఎం.. వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన టార్గెట్‌ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్సైజ్ విభాగంలో అక్రమాలు అరికట్టి పూర్తి ట్యాక్స్ వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని డిస్టిలరీల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. బాటిల్ ట్రాకింగ్ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories