నేడు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy: నిన్న కేబినెట్‌ మీటింగులో కీలక అంశాలపై జరిగిన చర్చ

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 21 May 2024 8:14 AM IST
CM Revanth Reddy Review of Industries Department today
X

నేడు పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 

Revanth Reddy: ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్‌బా‌గ్‌‌లోని పరిశ్రమల భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు.. దివాళ తీసిన పెద్ద పరిశ‌్రమలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తుంది.

కాగా..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో తెలంగాణలో ఐటీ కారిడార్‌తో సమానంగా.. ఇండస్ట్రీయల్ కారిడార్ ను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని.. రేవంత్ రెడ్డి ప్రకటించారు.. ఇటు.. ఔటర్ రింగ్ రోడ్డు.. అటు ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముందే ప్రకటించారు.. అందుకు అనుగుణంగానే ఈరోజు ఈసమావేశంనిర్వహించన్నట్టు తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story