Revanth Reddy: రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

Revanth Reddy: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 14 Aug 2024 12:49 PM IST
Revanth Reddy: రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం
X

Revanth Reddy: రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి బృందం

Revanth Reddy: విదేశీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకుంది. కొద్ది సేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకుంది. రాష్ట్రానికి చేరుకున్న సీఎం బృందానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్‌కి చేరుకున్నారు. దక్షిణకొరియాలో రెండ్రోజుల పాటు రేవంత్ పర్యటించారు.

పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు. అక్కడ పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు... వచ్చి రాగానే కోకాపోటలో కొత్త క్యాంపస్‌కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్‌తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story