Revanth Reddy: గద్దర్, జార్జిరెడ్డి లాంటి దిగ్గజాలు ఓయూ నుంచే ఉద్భవించారు

Revanth Reddy: గద్దర్, జార్జిరెడ్డి లాంటి దిగ్గజాలు ఓయూ నుంచే ఉద్భవించారు
x

Revanth Reddy: గద్దర్, జార్జిరెడ్డి లాంటి దిగ్గజాలు ఓయూ నుంచే ఉద్భవించారు

Highlights

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించి, విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో పర్యటించి, విద్యార్థులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. సీఎం హోదాలో రెండోసారి ఓయూకి వచ్చిన రేవంత్ రెడ్డి, యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు శంకుస్థాపన చేశారు.

ఓయూ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయింపు:

ఓయూ అభివృద్ధి నమూనా వీడియోను విడుదల చేసిన సీఎం, యూనివర్సిటీకి రూ.1000 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో కొత్త భవనాలు నిర్మించి, ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. "తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయ లాంటిది. రెండేళ్లలో ఓయూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం" అని ఆయన హామీ ఇచ్చారు.

ఓయూ విద్యార్థులకు, నిరంకుశ పాలనపై కీలక వ్యాఖ్యలు:

సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో గత పాలకుల విధానాలపై విమర్శలు గుప్పించారు. "ఓయూకు వస్తానంటే మీరెందుకు వెళ్తున్నారని నన్ను అడిగారు. ఓయూకు రావాలంటే ధైర్యం కావాలని అన్నారు. కానీ ఓయూకు రావాలంటే ఉండాల్సింది ధైర్యం కాదు.. అభిమానం" అని పపేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనలో ఓయూ కీలక పాత్ర పోషించిందని, ప్రజాప్రతినిధులను అడ్డుకున్న చరిత్ర కూడా ఈ వర్సిటీకి ఉందని గుర్తుచేశారు.

"గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి విద్యావ్యవస్థను నాశనం చేసింది. పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించలేకపోయారు. అధికారం అంటే ఫాంహౌస్‌లు కట్టుకోవడమేనా?" అని పరోక్షంగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. "అభివృద్ధి అంటే అద్దాల మేడలు, గోడలు కాదు. పేదలకు భూమి లేకపోవడం పేదరికం కాదు.. చదువులేకపోవడమే పేదరికం. వివక్షను అణిచివేయాలంటే విద్య అవసరం." అని విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పారు.

"నాకు ఇంగ్లీష్ రాదని కొందరు విమర్శిస్తున్నారు. భాష కేవలం కమ్యూనికేషన్ మాత్రమే.. నాలెడ్జ్‌ కాదు. ఇంగ్లీష్ రాదని ఆత్మస్థైర్యం కోల్పోవద్దు," అంటూ విద్యార్థులలో ధైర్యాన్ని నింపారు. గొప్ప దిగ్గజాలైన గద్దర్, జార్జిరెడ్డి లాంటివారు ఓయూ నుంచే ఉద్భవించారని, సమాజానికి ఏ సమస్య వచ్చినా ఓయూ విద్యార్థులు ముందుంటారని ప్రశంసించారు.

2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ పిల్లలు గోల్డ్ మెడల్స్ సాధించే దిశగా తీర్చిదిద్దుతామని, కొత్త పరిశోధనలు చేసేవారికి ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో, స్పీచ్‌లు రాసుకుని రాలేదని, తన మనసులో ఏముంటే అదే మాట్లాడతానని స్పష్టం చేశారు. విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుని ఓయూను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories