Revanth Reddy: నేను ఫామ్‌హౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే సీఎంను..

CM Revanth Reddy Participate in Celebrations of  Praja Palana Dinotsavam
x

Revanth Reddy: నేను ఫామ్‌హౌస్‌ సీఎంను కాదు.. పనిచేసే సీఎంను..

Highlights

Revanth Reddy: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి గన్​పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు.

Revanth Reddy: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి గన్​పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలనా దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. తాను ఫామ్‌హౌస్ సీఎం కాదని, పని చేసే సీఎం అని చెప్పారు. ఐక్యత, సమైక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాన్ని పలుచన చేయరాదని, ఈ నిర్ణయాన్ని తప్పుబట్టడం స్వార్థమే అవుతుందని మండిపడ్డారు. గత పదేళ్లు తెలంగాణ నియంత పాలనలో కొనసాగింది. కానీ ఇకపై రాష్ట్రంలో పాలన బాధ్యతాయుతంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

తెలంగాణ హక్కుల కోసం.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి పోతామని పేర్కొన్నారు. లేక్ సిటీ కాస్త.. డ్రగ్స్ సిటిగా మార్చేశారని గులాబీ సర్కార్ పై ఆగ్రహించారు. చెరువుల రక్షణకు హైడ్రాను తీసుకొచ్చామన్నారు. ప్రకృతి విపత్తు రాకుండా చూడాలని కోరారు. హైడ్రా వెనకాల రాజకీయం లేదన్నారు. కొందరు హైడ్రానీ నీరుకార్చే పనిలో ఉన్నారు.. ఎవరు అడ్డుకున్నా ఆగదు హైడ్రా ప్రజలు సహకరించాలని చెప్పారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories