Revanth Reddy: మేడిగడ్డకు బస్సుల్లో బయల్దేరిన రేవంత్ అండ్ టీమ్..

Revanth Reddy: మేడిగడ్డ సందర్శనకు బీఆర్ఎస్, బీజేపీ దూరం

Shekhar G
Published on: 13 Feb 2024 12:05 PM IST
Cm Revanth Reddy Ministers And Mlas Are Going To Visit Medigadda Barrage
X

Revanth Reddy: మేడిగడ్డకు బస్సుల్లో బయల్దేరిన రేవంత్ అండ్ టీమ్..

Revanth Reddy: మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి నాలుగు బస్సుల్లో పయనమయ్యారు. ప్రాజెక్ట్‌ను సందర్శించిన అనంతరం.. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు. అంతకు ముందు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మేడిగడ్డపై... కాంగ్రెస్, బీఆర్ఎస్‌ మధ్య డైలాగ్ వార్ నడిచింది.గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇసుక కుంగడం వల్లే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో లోపాలు ఉన్నాయని విజెలెన్స్ నివేదికను ఇచ్చిందని తెలిపారు. మేడిగడ్డను ఇసుకతో పేకమేడలా నిర్మించారా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్.

Shekhar G

Shekhar G

Next Story