CM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. 'హంగ్' మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్!

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో భేటీ కానున్నారు.

Arun Chilukuri
Published on: 14 Feb 2026 10:51 AM IST
CM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. హంగ్ మున్సిపాలిటీలపై స్పెషల్ ఫోకస్!
X

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో భేటీ కానున్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషణ, హంగ్ మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగిసిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన మంత్రులు, ముఖ్యులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో వెలువడిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలపై సమావేశంలో చర్చించనున్నారు. మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ, ఎక్కడైనా ఆశించిన ఫలితాలు రాని చోట దానికి గల కారణాలను విశ్లేషించనున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఈ నెల చివరి వారంలో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల నిర్వహణ, అసెంబ్లీలో ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కోవడం, బడ్జెట్‌లో ప్రవేశపెట్టబోయే కొత్త పథకాలపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన కీలక నిర్ణయాలు, ఇతర ప్రాధాన్యత కలిగిన అంశాలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఆ భేటీ ముగిసిన వెంటనే సీఎం మీడియా ముందుకు రానున్నారు. మున్సిపల్ ఎన్నికల విజయంపై ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతో పాటు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికలను ఆయన వెల్లడించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story