CM Revanth Reddy: ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

CM Revanth Reddy: హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

Arun Chilukuri
Published on: 5 Jan 2026 5:26 PM IST
CM Revanth Reddy: ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
X

CM Revanth Reddy: హనుమకొండ జిల్లా ప్రఖ్యాత ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అసెంబ్లీ ఛాంబర్‌లో మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులతో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story